Tamannah : టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె వెంకటేశ్ సరసన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 ఈ సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలోనూ నటిస్తోంది.
కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై, వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే తమన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తమన్నా తన ఇన్ స్టాగ్రాగ్రామ్ ద్వారా ఒక ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CWpsl3DPfID/?utm_source=ig_embed&ig_rid=30dbcabe-bbbb-452b-8270-dc97a73d9f15
తమన్నా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం దేవత రూపంలో కూర్చొని అరిటాకులో భోజనం చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఈ ఫోటోపై నటి సమంత స్పందించింది. ఈ ఫోటోపై స్పందిస్తూ సమంత లవ్ సింబల్ ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.