Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. భారీ చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. బాహుబలి తర్వాత తమన్నాకు వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కాయి. హీరోయిన్‌గా అగ్ర హీరోలందరితోనూ జోడీ కట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసింది. ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తోంది. అటు బాలీవుడ్ లోనూ వరుస ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటోంది.
అయితే.. పదిహేడేళ్ల సినీ కెరీర్ లో తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పింది మిల్కీ బ్యూటీ. ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ తాత్కాలికమేనని పేర్కొన్నది. తన సినీ ప్రయాణాన్ని గురించి తమన్నా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో వేసే ప్రతి అడుగు ఎంతో ముఖ్యమనదైని తెలిపింది. ఎన్నో పాఠాలను నేర్పుతుందని చెప్పింది. ప్రతి బాల్ సిక్స్ కొట్టాలంటే కుదరదు అన్నది తమన్నా.
ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఎంతోమంది సమిష్టి కృషిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ విజయమైనా, పరాజయమైనా నటీనటులు ఒక్కరి వల్లే అవదు. హిట్ దక్కిందని ఆనందపడేలోపు పరాజయం పలకరించి బాధపెడుతుంది.. అని తెలిపింది. తన కెరీర్ లో అంతులేని బాధను, ఆవేదనను అనుభవించిన క్షణాలు చాలా ఉన్నాయన్నది తమన్నా. కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ తో ఎత్తుపల్లాల నుంచి బయట పడగలిగానని అంటోంది మిల్క్ బ్యూటీ.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సత్యదేవ్ తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమా చేస్తోంది. వీటితోపాటు బాలీవుడ్ లో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, భోలే చుడియా, ప్లాన్ ఎ ప్లాన్ బి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…