Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు తన అందచందాలతో నానా రచ్చ చేస్తోంది. దాదాపు 17 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని హీరోయిన్‌గా ఏలడం అంటే మాములు విషయం కాదు. తమన్నా తన మిల్కీ అందాలతో తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లోనూ సత్తా చూపెడుతోంది. ఇప్పటికే వన్నె తగ్గని అందంతో మత్తెక్కిస్తోన్న తమన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తమన్నా రీసెంట్ గా సీటీమార్ చిత్రంలో నటించగా.. ఈ సినిమా విషయానికి వస్తే.. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10, 2021న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా 600 వరకు థియేటర్‌లలో తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయింది.
తమన్నా నటించిన ఎఫ్ 3 చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే హీరోయిన్ తమన్నాకు, ఎఫ్ 3 యూనిట్ కు మధ్య గట్టి గొడవ జరిగిందని టాక్స్ వినిపిస్తున్నాయి. ఆమె డేట్ లు కేటాయించడం, షూటింగ్ కు రావడం వంటి విషయాల్లో అంత స్పష్టత ఉండదని, బాగా ఆలస్యం చేస్తూ ఉంటుందని వినిపిస్తూనే ఉంది. ఈ విషయంలోనే ఎఫ్ 3 సెట్ లో కొన్ని వారాల క్రితం చిన్న గడబిడ అయిందని సమాచారం. అది చిలికి చిలికి గాలివానగా మారి నిర్మాత దిల్ రాజు యూనిట్ కు, తమన్నాకు మధ్య వివాదం బిగుసుకుపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదృష్టం కొద్దీ సినిమా వర్క్ పూర్తయిపోయింది.
సినిమాకి సంబంధించి టోటల్ టీమ్ తో ఒక ప్రమోషనల్ సాంగ్ ప్లానింగ్ ఉంది. అది అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేయాల్సి ఉంది. మరి తమన్నా ఈ సాంగ్ కు హాజరవుతుందో లేదో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అంతే కాదు, ఈ పాటను పక్కన పెట్టి, వేరే ప్రత్యేక గీతం ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఇదిలే ఉండగా తమన్నా ఇటీవల మాస్టర్ చెఫ్ అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేయగా, ఈ షో విషయంలో కూడా తమన్నాకి, నిర్వాహకుల మధ్య పలు వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక తాజా గొడవతో మరోమారు తమన్నా పేరు వార్తల్లో నిలిచింది. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…