Heart Attack : మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తూ అలుపెరుగని యోధుడిలా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనిషి సగటు జీవిత కాలంలో గుండె దాదాపుగా 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే రక్తంలో కొలెస్ట్రాల్ లేకుండా మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. మారుతున్న జీవన శైలిని బట్టి అతి చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
అధిక బరువుతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు లోనవుతున్నారు. గుండె పదిలంగా ఉండాలంటే రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించే వాటిలో డ్రై ఫ్రూట్స్ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో డ్రైఫ్రూట్స్ వాడకం కూడా బాగానే పెరిగింది. గుండె ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ ఎలాంటి పాత్రను పోషిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు మూడు పిస్తా పప్పులు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. పిస్తా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా అధిక బరువు సమస్యలను కూడా తగ్గిస్తాయి. రోజుకు 6 బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తినడం ద్వారా శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నిషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. నిత్యం బాదం పప్పు తినడం వలన శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండెను కాపాడుతాయి.
బాదం, పిస్తాతో పాటు వాల్ నట్స్ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెరిగేలా చేస్తాయి. అందువలన వాల్ నట్స్ అనేవి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రోజుకు 6 వాల్ నట్స్ ను మనం తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. అంతే కాకుండా అధిక బరువు, డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఈ మూడు రకాల డ్రై ఫ్రూట్స్ ను నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…