Dried Strawberry : ప్రస్తుత కాలంలో అనేక మహమ్మారి వైరస్ లు మనిషి మనుగడను అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడే మార్పుల వలన కావచ్చు.. మనుషులు చేసే తప్పిదాల వలన కావచ్చు.. అనేక రకాల వైరస్ లు శరీరంలో ప్రవేశించి ప్రాణాలకు ప్రమాదం కలిగే రోగాల బారిన పడే విధంగా అనారోగ్యాలకు గురిచేస్తున్నాయి. ఎంత భయంకరమైన వైరస్ అయినా సరే మన శరీరంలో ప్రవేశించినా కూడా మన వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వ్యాధినిరోధక శక్తి దృఢంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో శ్రద్ధ వహించడం ఎంతో ఉత్తమం.
కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అందరూ శరీరంలో యాంటీబాడీస్ అనే పదం వినే ఉంటారు. యాంటీ బాడీస్ అంటే తెల్లరక్తకణాలు. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరంలోకి వచ్చే వైరస్ మరియు బ్యాక్టీరియాలను తరిమి కొట్టడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మరి యాంటీ బాడీస్ ఉత్పత్తిని పెంచాలంటే ఏం సపోర్ట్ చేస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తీసుకునే ఆహారంలో నిత్యం స్ట్రాబెర్రీస్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. స్ట్రాబెర్రీస్ నిత్యం ఆహారంలో తీసుకోవడం వలన రక్షణ వ్యవస్థలో బీ సెల్స్ అనేవి యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో యాంటీ బాడీస్ ని ఉత్పత్తి చేయాలి అంటే పోషకాలు కావాలి. 100 గ్రాముల స్ట్రాబెరీస్ లో 50 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇందులో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా అధిక మోతాదులో ఉంటాయి.
స్ట్రాబెరీలలో సి, కె వంటి విటమిన్లుతోపాటు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి స్ట్రాబెర్రీస్ లో అధికంగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్ట్రాబెరీలోని పొటాషియం, మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను దూరం చేస్తాయి. రక్తసరఫరా సవ్యంగా జరిగి హృదయ కండరాలు గట్టిపడడాన్ని అడ్డుకుంటాయి. స్ట్రాబెరీలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారించి గుండెపోటు వంటి ప్రమాదాలను అరికడతాయి.
అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా స్ట్రాబెరీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో కొవ్వును కరిగించే లెప్టిన్, అడిపోనెక్టిన్ వంటి హార్మోన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి, రక్తంలో చక్కెర శాతం పెరగకుండా నియంత్రిస్తాయి. గర్భిణులు స్ట్రాబెరీ పండ్లను తినడం వలన బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ ఆమ్లం లభిస్తుంది. ఇలా స్ట్రాబెర్రీస్ ని నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్తంలోని బీ-సెల్స్ ను యాక్టివ్ గా ఉంచి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. నిత్యం మనకు తాజా స్ట్రాబెర్రీస్ అందుబాటులో ఉండవు కాబట్టి బయట డ్రై స్ట్రాబెర్రీస్ కూడా లభిస్తాయి. ఇలా లభించిన డ్రై స్ట్రాబెర్రీస్ ని రోజుకి ఒక ముక్క తింటే చాలు ఉక్కులాంటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…