T20 World Cup 2022 : మొదటి టి20 ప్రపంచకప్‌లో గెలిచిన టీమిండియా ఆ తరువాత విజయాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. కానీ ప్రతి టి20 వరల్డ్ కప్‌లోనూ విఫలమవుతూనే వస్తోంది. అయితే ఈసారైనా టి20 వరల్డ్ కప్ గెలవాలన్న ఆశతో టీమిండియా ఉంది. కానీ ఇంతలోనే ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. నిప్పులపై నీరు పడ్డట్టు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతూ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ బుమ్రా ఇద్దరూ గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. మ్యాచ్ లో కీలకమైన సమయాల్లో సమయస్ఫూర్తితో ఆడుతూ ఎంతటి మ్యాచ్ నైనా మలుపు తిప్పగల కీలక ప్లేయర్లు లేకుండా టి20 వరల్డ్ కప్ ఆడనుంది ఇండియా.
ఈ తరుణంలో అభిమానుల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది. వీరు లేకుండా ఆరు జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ గెలవలేని జట్టు.. ఇప్పుడు వరల్డ్ కప్ ను గెలుస్తుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలాగైతే టీమిండియాను కాపాడే వారు ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. హర్షల్ పటేల్, హర్ష దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ కు ఎంపికైన మిగతా ఆటగాళ్లు. మరి చివరి వరకు వీరైనా అందుబాటులో ఉంటారా లేదా అన్నది క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. దీనికి ప్రధాన కారణం బూమ్రా సంఘటనే.
తాజాగా బూమ్రా ఉన్నాడు అనుకుంటే.. ప్రస్తుతం అతను లేడు, గాయంతో దూరమయ్యాడు. దీంతో భారత బౌలింగ్ చాలా వీక్ అయిపోయింది. ఈ తరుణంలో గాయపడ్డ బుమ్రా ప్లేస్ లో షమిని అయినా జట్టులోకి తీసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు. కనీసం ఆ ప్లేయర్ నైనా జట్టులోకి తీసుకుంటే ఎలాగైనా కాపాడతాడని అభిమానుల నమ్మకం. ఒకవేళ టైటిల్ గెలవకపోయినా సరేగానీ కనీసం ఇండియా పరువు కాపాడతారని కొంతమంది అంటున్నారు. ఇక షమిని గత సంవత్సర కాలంగా టి20లకి ఎంపిక చేయడం లేదు. అలాంటప్పుడు బీసీసీఐ ప్రస్తుతం అలాంటి సాహసం చేస్తుందా అన్నది ప్రశ్నగా మారింది.
ఒకవేళ షమిని తీసుకోకుంటే గాయాలతో ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న దీపక్ ని మిగిలినటువంటి మ్యాచుల్లో ఆడించి ఈ మెగా పోరుకు సిద్ధం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే ప్రపంచ కప్ కు ఐదు నెలల ముందే జట్టు వారి ప్లేయర్స్ ను ఖరారు చేస్తుంది. దీని కోసం ముందే కొన్ని మ్యాచ్‌లను కూడా ఆడిస్తుంది. కానీ ఈసారి మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది.
ఆసియా కప్ లో విఫలం అయిన తర్వాత భారత్ జట్టులో మార్పు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగక పోగా మ్యాచ్ లో కొత్త బౌలర్లను కూడా బరిలోకి దింపుతున్నారు. దీంతో కెప్టెన్, కోచ్ ల ప్లానింగ్స్ ఏంటో ఎవరికీ కూడా అంతు చిక్కడం లేదు. ఇక ఇన్ని కారణాలతో ఇండియా వరల్డ్ కప్ ను గెలుస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…