T20 World Cup 2021 : వెస్టిండీస్‌పై స‌ఫారీలు అల‌వోక‌గా గెలుపు..!

T20 World Cup 2021 : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 18వ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. వెస్టిండీస్ ఉంచిన ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా సునాయాసంగానే ఛేదించింది. ఈ క్ర‌మంలో విండీస్‌పై స‌ఫారీలు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించారు.

మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో విండీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గలిగింది. విండీస్ బ్యాట్స్‌మెన్ల‌లో ఎవిన్ లెవిస్ ఒక్క‌డే రాణించాడు. మొత్తం 35 బంతులు ఆడిన లెవిస్ 3 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 56 ప‌రుగులు చేశాడు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో డ్వెయినె ప్రిటోరియ‌స్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా కేశ‌వ్ మ‌హారాజ్ 2 వికెట్లు తీశాడు. క‌గిసో ర‌బాడా, అన్‌రిక్ నోర్‌జెల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 18.2 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 144 ప‌రుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ల‌లో ఎయిడెన్ మార్క‌ర‌మ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 51 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాసీ వాన్ డెర్ డుస్సెన్ 51 బంతుల్లో 3 ఫోర్ల‌తో 43 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ‌రో బ్యాట్స్‌మెన్ రీజా హెండ్రిక్స్ 39 ప‌రుగులు చేశాడు. విండీస్ బౌల‌ర్ల‌లో అకియ‌ల్ హొసెయిన్‌కు 1 వికెట్ ద‌క్కింది.

Share
IDL Desk

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM