T20 World Cup 2021 : భారత్, పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే చాలు.. క్రికెట్ చూడని వారు.. ఆ ఆట గురించి తెలియని వారు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. దాయాది దేశాలు.. చిరకాల ప్రత్యర్థులు.. కనుకనే భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే.. పనులు మానుకుని, ఆఫీసులకు సెలవు పెట్టి, కాలేజీలకు బంక్ కొట్టి మరీ మ్యాచ్‌లను చూస్తుంటారు. ఇక ఈ రోజు ఆదివారం కనుక సెలవు పెట్టాల్సిన పనిలేదు. ఎంచక్కా మ్యాచ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
అయితే భారత్, పాకిస్థాన్‌ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ కనుక సహజంగానే భారత క్రికెట్ అభిమానులకు, ఇతర వీక్షకులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక సంస్థ అంచనా వేసిన ప్రకారం.. ఈ రోజు రాత్రి మ్యాచ్‌ను ఏకంగా 100 కోట్ల మంది చూస్తారని చెబుతున్నారు.
మన దేశంలో అనేక నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఇప్పటికే పలు థియేటర్లు భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను తెరలపై ప్రసారం చేయనున్నాయి. అనేక కాలనీల్లో, అసోసియేషన్ కార్యాలయాల్లో కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ మ్యాచ్ తెగ హై ఓల్టేజ్‌గా సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో భారత్‌దే పైచేయి కనుక.. ఈ మ్యాచ్‌లో కూడా అభిమానులు భారత్ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు. మరి టీమిండియా తన మొదటి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను ఢీకొంటుంది కనుక ఎలా ఆడుతారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…