Surekha Vani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన భర్త సురేష్ తేజ మరణానంతరం తన కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్న సురేఖవాణి తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను మరింత సందడి చేస్తోంది. సురేఖ వాణి ఏ సినిమా షూటింగులకు వెళ్లినా, ఫంక్షన్లకు వెళ్లినా.. వెంటనే తన కూతుర్ని తీసుకుని వెళుతూ తన కూతురికి మరింత పాపులారిటీ తీసుకువస్తోంది. తాజాగా సురేఖవాణి తన కూతురుతో కలిసి మరోసారి డాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
https://www.instagram.com/reel/CVUaC19p7W0/?utm_source=ig_web_copy_link
ఇలా ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇందులో తల్లీ కూతురు ఇద్దరూ పోటీపడి డాన్స్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో షేర్ చేసిన కొంత సమయానికే వైరల్ గా మారింది.