Sunny Leone : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సన్నీ లియాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సన్నీ లియోన్ గత 10 సంవత్సరాలుగా ఇండియన్ సినిమాల్లో నటిస్తోంది. తాను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదరగొడుతూనే ఉంది. ఈ అమ్మడు నార్త్‌లోనే కాకుండా సౌత్‌లోను దుమ్మురేపుతోంది. మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు తదుపరి నటించబోతున్న చిత్రం ‘గాలి నాగేశ్వర రావు’. కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన పాయల్ రాజ్ పూత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సన్నీ పాత్ర కాస్త వెరైటీగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల దాడి ఏ రేంజ్‌లో చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘాటు ఘాటు అందాలతో కేక పెట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలని చూసి మైమరచిపోతుంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎరుపు రంగు చీర కట్టి తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సరదాగా బాస్కెట్‌బాల్ ఆడింది. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో ఆమె పోస్టు చేసింది. చీర కట్టులో బాస్కెట్‌బాల్ ఆడుతున్న సన్నీ వీడియో ఆమె అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
View this post on Instagram
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇండియన్ చిత్ర పరిశ్రమకు పరిచయమై 10 ఏళ్లు గడిచిన తర్వాత సన్నీలియోన్ ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకుంది. మొన్నటి వరకు అద్దె ఇంట్లో ఉన్న ఈ చిన్నది ముంబయిలో ట్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని కొనుగోలు చేసింది. హౌజ్ కోసం సన్నీ ఏకంగా రూ. 16 కోట్లు ఖర్చు చేయడం విశేషం.
బాలీవుడ్‌లో దశాబ్దం పూర్తి చేసుకున్న సన్నీలియోన్ చాలా కాలంగా అద్దె ఇంట్లో ఉంటోంది. సన్నీ లియోన్ ముంబైలో మూడు పడకగదుల విలాసవంతమైన పెంట్‌హౌస్‌ను తీసుకుంది. ఎక్కువ సమయం గడిపే ప్రధాన ఇల్లు భారతదేశమని.. తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పింది. తాము ఒక అపార్ట్‌మెంట్ నుంచి మరొక అపార్ట్‌మెంట్‌కు మారడం ద్వారా పిల్లలకు సరైన బేస్ ఇవ్వడం లేదని భావించామని.. తమ ఇంటికి వస్తే అమెరికన్ స్టైల్‌లో తయారు చేసినట్లు కనిపిస్తుందని.. సన్నీ లియోన్ చెప్పింది.