Sukumar : అల్లు అర్జున్‌తో కలిసి మూడో సారి సినిమాకు పనిచేస్తున్న దర్శకుడు సుకుమార్ చూస్తుంటే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండడం, టాకీ పార్ట్ షూటింగ్, 1000 మంది డ్యాన్సర్లతో ప్రత్యేకమైన పాట, పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. ఇవన్నీ ఇంకా మిగిలే ఉన్నాయి. దీంతో సుకుమార్ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
పుష్ప మూవీని పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. దీంతో మూవీ విడుదలకు మరో 40 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే పైన చెప్పిన పనులన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని భాషలకు చెందిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను సుకుమార్ స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక తన అవసరం లేని, పెండింగ్‌లో ఉన్న సీన్లను సహాయక దర్శకులచే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఆ సీన్లకు గాను సుకుమార్ వీడియో కాల్స్ తో మేనేజ్ చేస్తున్నారట. దీంతో సుకుమార్‌పై అధికంగా భారం, ఒత్తిడి పడుతున్నాయని తెలుస్తోంది.
అయితే ఇంత ఒత్తిడి, భారం పడినా.. అవుట్ పుట్ సరిగ్గా రాకపోతే అప్పుడు దర్శకుడినే అంటారు. దీంతో సుకుమార్ అత్యంత సున్నితంగా, జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ తేడా కొట్టినా.. ముందుగా అనేది దర్శకుడినే. మరి సుకుమార్ పడ్డ కష్టానికి ప్రతిఫలం సినిమాలో కనిపిస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…