Sudigali Sudheer : తెలుగు టీవీ ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుధీర్ ఎప్పటి నుంచో జబర్దస్త్ వేదికపై కమెడియన్‌గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో సినిమాల్లోనూ చాన్స్‌లు వస్తున్నాయి. ఇక పలు ఇతర షోలలోనూ సుధీర్ సందడి చేస్తున్నాడు. జబర్దస్త్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో సుధీర్ పేరు ఒకటి. అయితే జబర్దస్త్‌లో ప్రస్తుతం సుధీర్ కనిపించడం లేదు. అక్కడ పలు కారణాల వల్ల షో నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో ఇతర షోలు చేస్తున్నాడు.
సుధీర్ చేసిన చాలా షోలకు మంచి రేటింగ్స్ వచ్చాయి. జబర్దస్త్ తోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలకు సుధీర్ వల్లే రేటింగ్స్ పెరిగాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక శ్రీదేవి డ్రామా కంపెనీలో పలు ఎపిసోడ్స్‌లోనూ సుధీర్ కనిపించాడు. కానీ అక్కడ కూడా మానేశాడు. ప్రస్తుతం స్టార్ మాలో షోస్ చేస్తున్నాడు సుధీర్. ఇక స్టార్ మాలో పార్టీ లేదా పుష్పకు యాంకర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ షోకు గాను సుధీర్ భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
జబర్దస్త్‌లో సుధీర్ ఒక ఎపిసోడ్‌కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తీసుకునేవాడట. తరువాత శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఇచ్చారట. అయితే ఆ షోల నుంచి తప్పుకునేటప్పుడు సుధీర్‌కు రూ.10 లక్షలు ఇస్తామన్నారట. కానీ స్టార్ మాలో ఇంకా అంత కన్నా ఎక్కువే ఆఫర్ చేశారు. దీంతో స్టార్ మాలో చేరిపోయాడు. ప్రస్తుతం ఒక్క షెడ్యూల్‌కు సుధీర్‌కు స్టార్ మా వారు రూ.15 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుధీర్‌కు రెమ్యునరేషన్ డబుల్ అయిందని చెప్పవచ్చు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…