Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. మొదట్లో మెజీషియన్ గా ప్రస్థానం మొదలుపెట్టి ప్రస్తుతం బుల్లితెర స్టార్ గా తనదైన శైలిలో దూసుకుపోతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. ఇక సుడిగాలి సుదీర్ బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ కు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఈక్రమంలోనే సుడిగాలి సుధీర్ కు మ్యాచెస్ వెతికే పనిలో పడ్డారట. సుడిగాలి సుధీర్, రష్మి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ కేవలం అవన్నీ అపోహలు మాత్రమేనని ఎన్నో సందర్భాలలో కొట్టిపారేశారు. ఇక తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లి కోసం తన స్నేహితులు ఎన్నో కష్టాలు పడుతున్నారని తెలుస్తోంది. సుధీర్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతికే పనిలో పడ్డారట.
సుధీర్ తన స్నేహితుల ద్వారా కొన్ని సంబంధాలు చూశాడని.. ఈ సమయంలోనే అతనికి ఒక అమ్మాయి విపరీతంగా నచ్చిందని, త్వరలోనే సుధీర్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆ అమ్మాయి కూడా సుధీర్ సొంత జిల్లాకు చెందిన అమ్మాయేనట. దీంతో త్వరలోనే అమ్మాయి ఎవరు, ఏంటి.. అనే విషయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.