Sudigali Sudheer : బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పర్లేదు. బుల్లితెర సూపర్ స్టార్ అంటూ సుధీర్ ని ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. అయితే అది గతం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బుల్లితెరపై ఆయన సందడి తగ్గి పోయింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను వదిలి వెళ్ళి పోయినా సుధీర్ కి స్టార్ మా వారు పెద్ద షాకిచ్చారు. అందులో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని క్యాన్సల్ చేశారట. బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేమని చేతులెత్తేయడంతో సుడిగాలి సుధీర్ తిరిగి ఈటీవీలోకి వెళ్లలేక.. ఏం చేయాలో తెలీక ఇబ్బంది పడుతున్నాడట.
ఎలాగో స్టార్ మా వాళ్లు ఈటీవీ నుండి సుడిగాలి సుధీర్ ని తీసుకొచ్చారు కనుక బిగ్ బాస్ లో అవకాశం కల్పించారట. బిగ్ బాస్ సీజన్ 6 ఐదవ వారంలో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించలేక పోతున్నారు. అందుకే ఈ సమయంలో సుడిగాలి సుధీర్ హౌస్ లోకి వెళితే కచ్చితంగా మంచి రేటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో సుధీర్ కి భారీ పారితోషకం ఆఫర్ చేసి మరీ హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది.
సోమవారం లేదా మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో సుడిగాలి సుధీర్ అడుగు పెట్టే అవకాశం ఉందంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే బుల్లితెర ద్వారా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ లోకి వెళ్లడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు మాత్రం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగానే ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై 1,2 రోజుల్లోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుధీర్ కనుక హౌస్ లోకి ఎంటర్ అయితే.. ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…