Suchendra Prasad : నటి పవిత్ర లోకేష్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఆమె తన ఫేక్ అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. మరోవైపు ఓ కన్నడ న్యూస్ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆమె సంచలన విషయాలను వెల్లడించింది. తనకు, నరేష్‌కు ఉన్న సంబంధం నిజమేనని అంగీకరించింది. సూపర్ స్టార్ కృష్ణకు ఈ విషయం తెలుసని.. నరేష్ కుటుంబ సభ్యులు తమకు అడ్డు చెప్పలేదని.. ఇంక ఎవరు ఏం అనుకున్నా తనకు అభ్యంతరం లేదని తెలియజేసింది. అలాగే తనకు, సుచేంద్ర ప్రసాద్‌కు పెళ్లి కాలేదని.. సహజీవనం మాత్రమే చేశామని ఆమె తెలిపింది. అయితే అనూహ్యంగా సుచేంద్ర ప్రసాద్ ఈ మ్యాటర్‌లోకి రంగ ప్రవేశం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
పవిత్ర లోకేష్ వ్యవహారంపై సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పవిత్రా లోకేష్‌తో జీవితం మొదట్లో బాగానే ఉండేదని అన్నారు. అయితే తమకు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆమె తనను ఒంటరిని చేసి వెళ్లిపోయిందని అన్నారు. ఆమెకు ఎల్లప్పుడూ డబ్బు, విలాసాలు కావాలని, లగ్జరీ లైఫ్‌ను కోరుకుంటుందని తెలిపారు. తాను అప్పట్లో ఆర్థికంగా ఆ స్థాయిలో లేనని, కనుక తనను వదిలేసిందన్నారు. తనతో కాపురం చేస్తున్నప్పుడు కూడా ఇతర వ్యక్తులతో ఆమె రిలేషన్ షిప్‌ను మెయింటెయిన్ చేసిందన్నారు. అయితే తాను ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదన్నారు.
తాను ఆమెను కొట్టినట్లు, తిట్టినట్లు చెప్పిందని.. అయితే అవన్నీ నిజాలు కావని అన్నారు. నేను కొడుతున్నానని చెప్పి నరేష్‌తో ఉండడం ఎంత వరకు కరెక్ట్ ? అని ప్రశ్నించారు. అసలు ఆయన కాపురాన్ని ఆమె ఎందుకు కూల్చాలి ? ఇది ఆమెకు అలవాటే.. వీలుని బట్టి ఎంత దొరికితే ఆమె అంత దోచుకుంటుంది.. ఆమెకు జీవితంపై ఆశలు ఎక్కువ.. కష్టపడే మనస్తత్వం కాదు. అయితే నరేష్‌ను ఆమె పెళ్లి చేసుకున్నా 6 నెలల్లోనే ఆమె ఆయనను వదిలేస్తుంది. తనకు కావల్సిన డబ్బు చేతికి అందాక ఆయనను ఆమె విడిచిపెడుతుంది.. ఇది పక్కా జరిగి తీరుతుంది.. అని సుచేంద్ర ప్రసాద్ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే సుచేంద్ర ప్రసాద్ కామెంట్స్‌పై పవిత్రా లోకేష్ ఏమంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…