Thaman : నేచురల్ స్టార్ నాని రీసెంట్‌గా శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా నాని చేసిన కొన్ని కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఏపీ టిక్కెట్ల వ్యవహారంపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. ఇక ఓ ఇంటర్వ్యూలో నటులు, టెక్నీషియన్స్ ఎవరూ సినిమాను డామినేట్ చేయకూడదని అన్నారు.
అంతే కాదు సంగీతం కానీ వేరే ఏదైనా క్రాఫ్ట్ కానీ ఫిల్మ్‌తో కలిసి ముందుకు సాగినపుడే ఆ సినిమా హైలైట్ అవుతుందని చెప్పాడు. నిజానికి నానికి చెందిన అంతకు ముందు మూవీ టక్ జగదీష్ ఓటీటీలో విడుదలై ప్లాఫ్ అయింది. ఈ మూవీకి థమన్ సంగీత దర్శకుడు. అతడిని గోపీ సుందర్‌తో రీప్లేస్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు నానికి వ్యతిరేకంగానే థమన్ ట్వీట్ చేసినట్టు ప్రచారం నడుస్తోంది.
We call it a Complete FILM when all the crafts Together Excel in all formats 🥁It’s never so called Dominated Crafts .. lol
it’s the Deeper UNDERSTANDING of a Film Knowing it’s depth in dialogues it’s Narration & making It dive in Smooth to the Next Sequences 🎥🎵🥁
1/2
— thaman S (@MusicThaman) December 29, 2021
So Without a Great Visualisation Great Making Great characterisations Well Written Scripts With True Emotions Narrated in a Proper Pace Directed Magnanimously & Standout Performances from the Artists
It’s Never One Man Show ✊
We love CINEMA & WE DIE FOR IT ❤️🩹
God bless
— thaman S (@MusicThaman) December 29, 2021
అన్ని క్రాఫ్ట్‌లు కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్ దేనినీ డామినేట్ చేయదని వరుస ట్వీట్లు చేశాడు థమన్. దీంతో ఈ వ్యాఖ్యలు నానిని ఉద్దేశించినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా అఖండ సినిమాకు బీజీఎం మెయిన్ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థమన్ ‘భీమ్లా నాయక్’, సర్కారు వారి పాట, RC 15, గని లాంటి క్రేజీ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.