ss thaman : సౌత్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే క్రాక్ సినిమా ద్వారా అద్భుతమైన హిట్ అందుకున్న తమన్.. ఆ తర్వాత వకీల్ సాబ్ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి కూడా తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల రామ్ చరణ్ సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న తమన్ కి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా మెగాస్టార్ బోళా శంకర్ సినిమాకు కూడా సైన్ చేశాడు. ఇప్పుడు మరొక క్రేజీ ఆఫర్ ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతో మంది హీరోలతో చేసిన తమన్ తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.
అయితే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పూర్తిస్థాయి తెలుగులో తెరకెక్కుతున్న చిత్రానికి సంగీత దర్శకత్వం బాధితులను ఎస్ఎస్త మన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో విజయ్ తో పోటీ పడటానికి నాచురల్ స్టార్ నాని విలన్ గా మారనున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.