Pushpa : ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే శ్రీవల్లి పాత్రకు సంబంధించిన పాటలను ఈనెల 13వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
కాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. సిద్ధ్ శ్రీరామ్ పాడిన “చూపే బంగారమయనే శ్రీవల్లి” అనే పాటకి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే పూర్తి పాటను చిత్ర బృందం అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన దాక్కొ దాక్కొ మేక అనే పాట ఐదు భాషల్లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక అక్టోబర్ 13వ తేదీన శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…