Srikanth : ఎన్‌టీఆర్‌, చిరంజీవి సినిమాల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన శ్రీ‌కాంత్ మూవీ.. ఏదంటే..?

Srikanth : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు న‌టుడు శ్రీ‌కాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎన్నో కుటుంబ‌, ప్రేమ క‌థా చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు పొందారు. కెరీర్ మొద‌ట్లో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌లలో న‌టించారు. ప్ర‌స్తుతం శ్రీకాంత్ హీరోగా కాకుండా విలన్ పాత్ర‌లు మ‌రియు పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల‌నే నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వెళ్తే  శ్రీకాంత్ ఒక‌ప్పుడు ఎన్టీర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమా రికార్డుల‌ను సైతం బ‌ద్ద‌లు కొట్టారనే అనే విషయం మీకు తెలుసా..

ఆ ఒక్క చిత్రమే శ్రీకాంత్ ని ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా నిలబెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెర‌కెక్కిన సినిమా పెళ్లి సంద‌డి. జనవరి 12, 1996లో ఈ సినిమా విడుదలైంది. పెళ్లి సందడి కంటే ముందు రాఘ‌వేంద్ర‌రావు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. అయితే స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన హ‌మ్ ఆప్ కు హై కోన్ సినిమా చూసిన త‌ర‌వాత రాఘ‌వేంద్ర‌రావు అలాంటి సినిమా చేయాల‌ని అనుకున్నారట. వెంట‌నే కథా ర‌చ‌యిత స‌త్యానంద్ ను పిలిపించి త‌న ఆలోన‌ల‌ను చెప్పటం జరిగిందట. అంతేకాకుండా ఈ చిత్రంలో పాట‌లు కూడా కథ‌లో భాగం అవ్వాల‌ని రాఘ‌వేంద్ర‌రావు సూచించారు. ఇక స‌త్యానంద్ ఏఎన్ఆర్ నటించిన పెళ్లి కానుక సినిమాను ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని పెళ్లిసంద‌డి క‌థను సిద్ధం చేశారు.

Srikanth

క‌థ‌ను రాఘ‌వేంద్ర‌రావుకు వినిపించగా ఆయ‌నకు కథ  బాగా నచ్చింది. 80ల‌క్ష‌ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాల‌ని భావించారు. ఈ సినిమా నిర్మించ‌డం కోసం మొద‌ట నిర్మాత అల్లు అర‌వింద్ ను సంప్ర‌దించారట. కానీ ఆయ‌న ఎక్కువ బ‌డ్జెట్ అని చిన్న సినిమా కావడంతో న‌లుగురం క‌లిసి చేద్దామ‌ని చెప్పారు. అలా ఈ సినిమాను రాఘ‌వేంద్ర‌రావు, అశ్వినిద‌త్, అల్లు అర‌వింద్ మ‌రో నిర్మాత భాగ్వ‌మ్యంలో కలిసి నిర్మించారు. పెళ్లి సందడి సినిమాకి హీరోగా తాజ్ మ‌హ‌ల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ను ఎంపిక చేశారు.

ఎలాంటి అంచనాలు లేకుండా జనవరి 12 1996లో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కీర‌వాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మ‌రో హైలెట్ అని చెప్పవచ్చు. పెళ్లి సందడి చిత్రం 44 కేంద్రాల‌లో 50 రోజులు, 33 కేంద్రాల‌లో 100 రోజులు ఆడి రికార్డులను బ్రేక్ చేసేసింది. ఇక ఎన్టీఆర్ ల‌వ‌కుశ సినిమా 27 కేంద్రాల‌లో 100రోజులు ఆడ‌గా ఆ సినిమా రికార్డుల‌ను పెళ్లిసందడి చిత్రం బ‌ద్ద‌లు కొట్టింది. అనేక థియేటర్లలో ఎక్కువ షోలు రన్ అయ్యి  చిరంజీవి రికార్డుల‌ను కూడా బ‌ద్ద‌లు కొట్టింది. ఇప్ప‌టికీ ఎక్కువ షోలు ఆడిన సినిమా కూడా పెళ్లిసంద‌డి చిత్రమే. పెళ్లి సందడి చిత్రం క్రియేట్ చేసిన రికార్డుతో హీరోగా శ్రీకాంత్ ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM