Medha : సీనియర్ నటుడు, హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో నటించగా.. అనేక సినిమాలు హిట్ అయ్యాయి. ఫ్యామిలీ హీరోగానే కాక, మాస్ హీరోగా కూడా శ్రీకాంత్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆరంభంలో ఈయన విలన్ పాత్రల్లో నటించారు. తరువాత హీరో అయ్యారు. అయితే ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో ఈయన మళ్లీ విలన్ పాత్రలను పోషిస్తున్నారు. ఈ మధ్యే బాలయ్య అఖండ మూవీలో శ్రీకాంత్ విలన్‌గా నటించి ఆకట్టుకున్నారు. ఇక శ్రీకాంత్ భార్య ఊహ అన్న విషయం తెలిసిందే. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరికి ముగ్గురు సంతానం కలిగారు. ఇద్దరు కుమారులు రోషన్, రోహన్ కాగా.. కుమార్తె మేధ ఉన్నారు.
అయితే శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే తిరుమల మాడ వీధుల్లో ఊహతోపాటు మేధ కూడా కనిపించింది. ఎరుపు రంగు సంప్రదాయ దుస్తులను ధరించి ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఆమెతో ఫొటోలు దిగేందుకు చాలా మంది ఆసక్తిని చూపించారు. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ మేధ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అచ్చం తల్లిలాగే ఎంతో అందంగా ఉందని ఆమెను కొనియాడుతున్నారు.
కాగా శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రుద్రమదేవి సినిమాలో బాలనటుడిగా అలరించాడు. అలాగే నిర్మల కాన్వెంట్ అనే చిత్రంతోపాటు పెళ్లి సందడి అనే మూవీలోనూ యాక్ట్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికీ నటనలో రోషన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక మేధ సినిమాల్లోకి వస్తుందా.. రాదా.. అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయినప్పటికీ ఆమె అందం చూస్తుంటే కచ్చితంగా సినిమాల్లోకి వస్తుందనే తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…