Sri Reddy : గోవా.. ఈ పేరు చెప్పగానే మనకు సుందరమైన ప్రదేశాలు గుర్తుకు వస్తాయి. ఆహ్లాదకరమైన బీచ్‌లు.. పచ్చని ప్రకృతి వనాలు.. నదులు.. కాలువలు.. ఇలా గోవాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందుకనే చాలా మంది విదేశీయులు కూడా గోవాకు వచ్చి బీచ్‌లలో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా బడ్జెట్ పెట్టి విదేశాలకు వెళ్లలేమనుకుంటే.. ఎంచక్కా గోవాకు వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. గోవా ఒక రకంగా చెప్పాలంటే ఫారెన్ కంట్రీలా ఉంటుంది. అందుకనే గోవాలో విహరించేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఈ సారి గోవాలో పర్యటిస్తోంది.

జూనియర్ ఎన్‌టీఆర్‌కు గోవాలో చాలా ఇష్టమైన ప్రదేశాలు ఇవే.. అంటూ శ్రీరెడ్డి తాజాగా తన యూట్యూబ్ చానల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీరెడ్డి గోవా అందాలను చూపిస్తుండడం విశేషం. ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే కడక్‌నాథ్ కోడి, పీతలు, చేపలు, మటన్ వంటి వంటకాలను వండి ఈమె అలరించింది. ఇక తాజాగా గోవా పర్యటనకు చెందిన వీడియోను ఆమె పోస్ట్ చేయగా.. దాన్ని నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
https://youtu.be/3g_ZUoiMMDs
కాగా శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో నాగబాబును సమయం లభించినప్పుడల్లా విమర్శిస్తోంది. నిహారిక కేసు విషయంలో నాగబాబుపై ఆమె తీవ్ర విమర్శలు చేసింది. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం మంత్రులను మార్చడంతో.. ఓ మహిళా మంత్రి తనకు నచ్చలేదని.. ఆమె బహిరంగంగానే చెప్పింది. దీంతో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.