Sri Reddy : టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో శ్రీరెడ్డి ఒక్క సారిగా పాపులర్ అయింది. ఈమె ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఉలిక్కి పడ్డారు. తరువాత ఆమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కకుండా పోయాయి. అలాగే ఆ సంఘటన జరిగిన నాటి నుంచి శ్రీరెడ్డి సినీ, రాజకీయ ప్రముఖలపై సంచలన కామెంట్స్ చేస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే సమాజంలో జరిగే సంఘటనలపై కూడా ఆమె స్పందిస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తుంటుంది.
ఇక శ్రీరెడ్డికి తెలుగులో అవకాశాలు లేకపోయేసరికి చెన్నైకి మకాం మార్చింది. అక్కడి నుంచే ఆమె సోషల్ మీడియా ద్వారా తరచూ కనిపిస్తోంది. ఇక యూట్యూబ్‌లో అయితే శ్రీరెడ్డి చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. ఆమెకు ఫేస్‌బుక్‌లో ఏకంగా 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పెట్టే పోస్టులు కూడా వైరల్ అవుతుంటాయి. ఆమె వంటల వీడియోలను ప్రస్తుతం పోస్ట్ చేస్తూ అందరినీ అలరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల వంటలను శ్రీరెడ్డి వండి వడ్డించింది.

శ్రీరెడ్డి తాజాగా రొయ్యలు ములక్కాడల ఇగురు అనే వంటను వండింది. అలాగే మధ్య మధ్యలో పచ్చి బూతులను కూడా వాడింది. తనపై నెగెటివ్‌గా ఎవరైనా కామెంట్స్ చేస్తే.. వారి అంతు చూస్తా.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక తరువాత తనదైన శైలిలో రొయ్యలను వండింది. వాటిని ఎలా వండితే బాగుంటాయో చెప్పింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె వీడియోను ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.