Sri Reddy : మెగా ఫ్యామిలీ అంటే అంతెత్తున విరుచుకు పడే శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. మధ్య మధ్యలో తనంటే గిట్టని వాళ్లకు కౌంటర్లు కూడా వేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్న శ్రీరెడ్డి ప్రస్తుతం యూట్యూబ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు వంటల వీడియోలతో అలరిస్తోంది. ఈ మధ్యే మటన్, చేపలు, పీతల కూరలతో అదరగొట్టింది. ఇక తాజాగా ఈమె కోడికూర వండింది. అయితే అది సాదా సీదా కోడి కాదు.. కడక్ నాథ్ కోడి. అదేనండీ.. శరీరం మొత్తం ఈకలతో సహా నల్లగా ఉంటుంది కదా.. అదే కోడి. ఆ కోడి కూరనే శ్రీరెడ్డి తాజాగా వండింది.

కడక్‌నాథ్ కోళ్లకు దేశంలో ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ కోళ్లు చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. సాధారణ కోళ్లతో పోలిస్తే వీటిని కొద్దిగా ఎక్కువ రోజుల పాటు పెంచాలి. ఇక ఈ కోళ్లలో కొవ్వు చాలా తక్కువగా.. పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకనే ఈ కోళ్లకు ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. వీటి గుడ్లు కూడా ఎక్కువ ధరనే కలిగి ఉంటాయి. అయితే శ్రీరెడ్డి తాజాగా కడక్‌నాథ్ కోళ్లను వండింది. ఈమె చేసిన కోడికూర చూస్తుంటే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. ఈ కోళ్లను ఎలా వండాలో కూడా శ్రీరెడ్డి తెలియజేసింది.
కడక్‌నాథ్ కోళ్ల సహజంగానే సాధారణ కోళ్ల కన్నా రుచిగా ఉంటాయి. కనుక వాటిని సరైన పదార్థాలతో వండితే కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకు గాను ఈ కోడికూరను కొబ్బరిపాలతో వండాలని శ్రీరెడ్డి చెప్పింది. అప్పుడు రుచి ఇంకా పెరుగుతుందని తెలియజేసింది. ఇలా ఈ కోడితో కూర వండి పురుషులు తింటే వారిలో కరెంట్ పెరుగుతుందని చెప్పింది. ఇది వారికి ఔషధంలా పనిచేస్తుందని తెలియజేసింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి వండిన కడక్‌నాథ్ కోడి కూర వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందరూ ఆ కోడికూరను తినాలని ఉందని కామెంట్లు చేస్తున్నారు.