Sri Reddy : నటి శ్రీరెడ్డి లేటెస్ట్‌గా పలు సంచలన ఆరోపణలతో మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆమె ఏపీలోని అధికార పార్టీ వైసీపీపై ఆరోపణలు చేసింది. తాను వైసీపీకి సపోర్ట్ చేసినా ఇప్పటి వరకు వారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పింది. తమ గ్రామంలో తాను, తన తండ్రి ఒక ఆలయాన్ని ప్రారంభిస్తే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు వచ్చాయి కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ఆరోపణలు వైరల్ అవుతుండగా.. ఆమె మాత్రం వంటలను చేయడంలో బిజీగా మారిపోయింది. ఈసారి మరో కొత్త వంటకంతో ఆమె మళ్లీ నెటిజన్ల ముందుకు వచ్చింది.
శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో తరచూ వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే చికెన్, మటన్, చేపలు, పీతలు వండిన శ్రీరెడ్డి రీసెంట్‌గా కోడిని బొగ్గులపై కాల్చింది. ఇక తాజాగా సొర చేప కూర వండింది. మసాలాలు అన్నీ దట్టించి వేసి మరీ కూరను చేసింది. దీంతో తాను వండిన సొర చేప కూరను తింటే మంచం విరగాల్సిందేనని ఆమె చెప్పుకొచ్చింది. కాగా శ్రీరెడ్డి లేటెస్ట్ వంటల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీరెడ్డి ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే ఘటనలపై ఈమె స్పందిస్తూ ఉంటుంది. ఈమధ్యే కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గొడవలో ఈమె శ్రీకాంత్‌కు మద్దతు ఇచ్చింది. తన జోలికి వస్తే తోలు తీస్తానని కరాటే కల్యాణిని హెచ్చరించింది. ఇక నాగబాబు కుమార్తె డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు కూడా శ్రీరెడ్డి ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఇన్ని సంఘటనల నడుమ కూడా శ్రీరెడ్డి వంటలు చేయడంలో బిజీ అయిపోయింది. ఆమె వంటల వీడియోలకు మంచి స్పందనే లభిస్తోంది.