Sri Reddy : అందాల ప్రదర్శన చేయడంలో శ్రీరెడ్డిని మించిన వారు లేరనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ఆమె పెడుతున్న వంట వీడియోల్లో చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. మసాలా కూరలను ఘాటుగా వండుతూనే అదే స్థాయిలో అందాల ప్రదర్శన కూడా చేస్తోంది. మధ్య మధ్యలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ సరే సరి. దీంతో ఆమె చాలా పాపులర్ అయింది. సినిమా చాన్స్‌లు లేకపోయినా ఈమె సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో రకరకాల వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది.
ఇక శ్రీరెడ్డి తాజాగా అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీని వండింది. దీంతోపాటు రెండు జడలు వేసుకుని లంగా వోణీ ధరించి ఎద అందాలను ప్రదర్శిస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా చెప్పింది. ఈ క్రమంలోనే ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి రోజు రోజుకీ అందాల డోసు పెంచుతుండడంతో యువతకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మొదటిసారిగా కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి టాలీవుడ్‌లో కొంతకాలం పాటు హడావిడి చేసింది. కానీ పవన్‌ను తిట్టడంతో ఈమె కొంత కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తరువాత చెన్నైకి మకాం మార్చింది.

చెన్నైలోనే ప్రస్తుతం శ్రీరెడ్డి ఉంటోంది. ఈ మధ్యే ఈమె అక్కడి ఓ టీవీ చానల్‌లో రియాలిటీ షో పేరిట అర్థరాత్రి రోడ్లపై రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్లే వాహనదారులను ఆపి వస్తావా.. అని ప్రాంక్ షో చేసింది. అయితే ఇటీవలే ఈమె పవన్‌కు మొదటిసారిగా మద్దతుగా మాట్లాడింది. పవన్ ను ఎవరైనా ఏమైనా విమర్శించండి. కానీ ఆయన భార్య, పిల్లలు, తల్లి జోలికి వెళ్లకండి. ఎవరైనా వారిపై కామెంట్స్ చేస్తే తాట తీస్తా అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది. శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ వీడియోలను పెడుతూ అలరిస్తోంది. అందులో భాగంగానే ఆమె వంటల వీడియోలకు చాలా పాపులారిటీ లభిస్తోంది.