Sreemukhi : తెలుగు టీవీ ఛానల్లలో బుల్లితెర రాములమ్మ శ్రీముఖి క్రేజ్ మామూలుగా లేదు. షోల మీద షోలు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. ఈ మధ్యే మొదలైన డాన్స్ ఐకాన్ షో తో పాటు సారంగ దరియా, స్టార్ మా పరివారం ఇలా పలు కార్యక్రమాలతో తెగ సందడి చేస్తుంది. చిరంజీవి తదుపరి సినిమా భోలా శంకర్ లో కూడా కీలక రోల్ లో నటించనుందని సమాచారం. అయితే ఇంతకాలం కాస్త పద్దతిగా డ్రెస్ లు వేసుకునే శ్రీ ముఖి ఈ మధ్య ఎక్స్ పోజింగ్ డోస్ మరింత పెంచేసింది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు మతులు పోగొడుతుందని అంటున్నారు.
ఈ మధ్య కొద్దిగా స్లిమ్ అయిన చబ్బీ బ్యూటీ దానికి తగ్గట్టుగా తన సైల్ కూడా పూర్తిగా మార్చేసింది. రెగ్యులర్ గా ఆమెను ఫాలో అయ్యే వారు అసలు ఆమె శ్రీముఖి యేనా అని ఆశ్చర్యపోతున్నారు. తరచూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ క్రేజ్ తగ్గకుండా చూసుకుంటుంది. తాజాగా శ్రీముఖి తను హోస్ట్ గా ఈటీవీ లో రాబోయే మిస్టర్ అండ్ మిస్సెస్ అనే షో కోసం చేసిన ఫోటో షూట్ లో భాగంగా దిగిన ఫోటోలో గ్లామర్ డోస్ ను మరింత పెంచేసి ఇంకో అడుగు మందుకేసింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పెద్ద ఝంకాలు అలాగే గోల్డెన్ కలర్ టాప్ లో తన క్లీవేజ్ ఇంకా ఉదర భాగం అంతా కనిపిస్తుండగా ముదురు నీలి రంగు లెహంగా ధరించింది.

ఏదైతేనేం ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలతో తన అభిమానులను అలరిస్తుందని సంబర పడుతున్నారు. ఇప్పటికే ఈమెకు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్న ఫాలోవర్లను మరింత పెంచుకుంటూ పోతుందని అంటున్నారు. ప్రస్తుతం శ్రీముఖి వాఖ్యాత గా చేయనున్న మిస్టర్ అండ్ మిస్సెస్ అనే షో త్వరలో ఈటీవీలో ప్రసారం కానుంది.