Sreeleela : శ్రీ‌లీల ల‌క్ మామూలుగా లేదు.. ఇంకో భారీ మూవీ ఆఫ‌ర్ కొట్టేసిందిగా..?

Sreeleela : సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చిన కూడా కొంతమంది మాత్రమే అదృష్టం కలిసి వచ్చి స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇటీవల వచ్చిన హీరోయిన్స్ లో ఈ అదృష్టం శ్రీలీలాకి బాగా ఉన్నట్లు కనిపిస్తుంది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శ్రీకాంత్ కుమారుడు రోష‌న్ కుమార్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన సినిమా పెళ్లి సందD. ఈ సినిమా గ‌త ఏడాది ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాతో హీరోయిన్ శ్రీలీలకి మాత్రం మంచి పేరు వచ్చింది. శ్రీలీల గతంలో కన్నడలో కూడా సినిమాలు చేయగా.. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత శ్రీలీల కొన్ని క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓకే ఒక సినిమాతో తన గ్లామర్ తో టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది.

ప్రస్తుతం శ్రీలీల రవితేజకు జంటగా ధమాకా చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం విడుదల కాకుండానే శ్రీలీలకు మరో భారీ ఆఫర్ తగిలినట్లు తెలుస్తుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిందట ఈ బ్యూటీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబుకి జంటగా శ్రీలీలను ఎంపిక చేశారు అని టాక్ వినిపిస్తుంది. మహేష్ 28వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కథాంశం పరంగా సెకండ్ హీరోయిన్ ఉంటుందట. ఆ ఛాన్స్ త్రివిక్రమ్ శ్రీలీలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీలీల సూపర్ స్టార్ పక్కన జతకట్టడం దాదాపు ఖాయమే అంటున్నారు సినీ ప్రముఖులు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Sreeleela

ఇక ఈ చిత్రం త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన మహేష్ బాబు లుక్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంది. అలాగే ఫస్ట్ టైం తన మూవీలో మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు. ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వచ్చే ఈ చిత్రాన్ని వేసవి బరిలో దించడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Share
Mounika

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM