Sreeleela : కుర్ర భామలు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఉప్పెన సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన కృతి శెట్టి పెద్ద సినిమాలలో అవకాశం దక్కించుకుంటోంది. ఇప్పుడు ఈ అమ్మడు దారిలో వెళుతోంది పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ వరుస సినిమాలని లైన్ లో పెడుతోంది శ్రీలీల. రీసెంట్‌గా నితిన్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇది నితిన్ 32వ సినిమా. ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల నటించనుంది. నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్ పై ఈ సినిమా చేయనున్నాడు. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు.
పలు చిత్రాలు ఈ అమ్మడి ఖాతాలో ఉండగా, తాజాగా మహేష్ మూవీ ఆఫర్ శ్రీలీలకి వచ్చినట్టు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ కచ్చితంగా ఉండాలి. అది అందరికీ తెలిసిందే. జల్సా దగ్గరనుంచి అల వైకుంఠపురంలో వరకు మాటల మాంత్రికుడు కథలో కానీ, ఆయన ఆలోచనలో కానీ ఎలాంటి మార్పు రాలేదు.
అల వైకుంఠపురములో సినిమా తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఇందుకోసం ఓ క్యాచీ టైటిల్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన అందాల భామ పూజా హెగ్డె హీరోయిన్‌గా నటించనుంది. త్రివిక్రమ్ రాసుకున్న కథ ప్రకారం ఇందులో మరో హీరోయిన్‌కి కూడా చోటుండటంతో ఈ ఛాన్స్ పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలకు ఇచ్చారని తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ అనే సరికి శ్రీ లీల ముందుగా నో అని చెప్పిందట. కానీ ఆమె కోసం త్రివిక్రమ్ కొద్ది మార్పులు చేశారని కూడా తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…