Sree Leela : ఇటీవల కుర్రభామలు ఒక్క సినిమాతోనే లైమ్ లైట్‌లోకి వస్తున్నారు. మంచి సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నారు. కృతి శెట్టి ఉప్పెన సినిమాతో డెబ్యూ ఇవ్వగా, ఇప్పుడు ఈ అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇదే రూట్‌లో శ్రీ లీల కూడా వెళుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీలీల.. రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీలో నటిస్తోంది.
కుర్ర హీరోలు శ్రీలీలనే హీరోయిన్‌గా రికమెండ్ చేస్తున్నారట. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు.. అందరి దృష్టి అటువైపే ఉంటోంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అమ్మడు నితిన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ కానుంది.
తాజాగా ఈ చిత్రానికి శ్రీలీల అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. నితిన్ మూవీకిగానూ శ్రీలీల ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు ఒకే చెప్పారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాలి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ్ రవితేజకు జోడీగా ధమాకా అనే సినిమాలో నటిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి డబ్యూ మూవీలోనూ శ్రీలీల హీరోయిన్ ఖరారు అయింది. రాధాకృష్ణ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీతో జెనీలియా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…