Sree Leela : టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో యువ హీరోయిన్లు చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు. ముఖ్యంగా కృతిశెట్టి, శ్రీలీల పిచ్చ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. కృతిశెట్టి అయితే మొదటి మూడు సినిమాలు హిట్ కావడంతో ఏకంగా చేతిలో అరడజను సినిమాలో బిజీగా మారింది. మరోవైపు మొదటి సినిమా అంతగా హిట్ కాకపోయినా శ్రీలీలకు కూడా ఆఫర్లు మామూలుగా రావడం లేదు. ఏకంగా బాలయ్య సినిమాలోనే నటించే చాన్స్ కొట్టేసింది. ఆయనకు కుమార్తెగా శ్రీలీల ఓ మూవీలో కనిపించనుందని సమాచారం.
ఇక శ్రీలీల కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగు సినిమాలతోనే. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి సందడితో పరిచయం అయింది. తరువాత ఆమెకు ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం మాస్ మహరాజ రవితేజతో కలిసి ధమాకా అనే మూవీలో నటిస్తోంది. అలాగే నితిన్ సినిమాలోనూ నటించే చాన్స్‌నూ దక్కించుకుంది. దీంతోపాటు ఇంకో మూవీలో బాలయ్య కుమార్తెగానూ ఆమె నటించనుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మళ్లీ ఇంకో బిగ్ మూవీలో నటించే చాన్స్ కొట్టేసిందని అంటున్నారు.
శ్రీలీల ప్రస్తుతం మరో బంపర్ ఆఫర్‌ను కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మహేష్ బాబు మూవీలో నటించనుందని సమాచారం. మహేష్, త్రివిక్రమ్ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఆమె చెల్లెలి పాత్రలో.. అంటే మహేష్‌కు మరదలి పాత్రలో శ్రీలీల నటించనుందట. ఈ విషయం ఇంకా అధికారికంగా కన్‌ఫామ్ కాలేదు. కానీ దీనిపై త్వరలోనే ప్రకటనను విడుదల చేస్తారని సమాచారం. ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఇది పూర్తయ్యాక జనవరి నుంచి మహేష్.. రాజమౌళితో సినిమా చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…