UPI : ప్రస్తుత తరుణంలో చాలా మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్న విషయం విదితమే. ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్‌ను విపరీతంగా వాడుతున్నారు. నగదు చెల్లింపులు తక్కువయ్యాయి. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకే కేంద్రం ఎన్‌పీసీఐ ద్వారా యూపీఐ మాధ్యమంలో చెల్లింపులు చేసేలా అవకాశాలను కల్పించింది. అందులో భాగంగానే అనేక యూపీఐ యాప్స్ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల సేవలను అందిస్తున్నాయి. అయితే వీటిల్లో రిజిస్టర్ అయి ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా డెబిట్ కావల్సి వస్తోంది. కానీ ఇకపై డెబిట్ కార్డు అవసరం లేకుండానే యూపీఐ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అందుకు గాను ఎన్‌సీపీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్‌లో రిజిస్టర్ అయ్యేందుకు కచ్చితంగా డెబిట్ కార్డు ఉండాల్సిందే. కానీ ఎన్‌పీసీఐ తెచ్చిన మార్గదర్శకాల మేరకు ఇకపై డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ యాప్స్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అందుకు గాను ఆధార్ ఉంటే చాలు. దానికి మొబైల్ నంబర్ కూడా అనుసంధానం అయి ఉండాలి. దీంతో డెబిట్ కార్డు అవసరం లేకుండానే యూపీఐ యాప్స్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తరువాత డబ్బులను పంపుకోవచ్చు. చెల్లింపులు జరపవచ్చు.
అయితే ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని ఎప్పుడో బ్యాంకులను ఆదేశించారు. కానీ బ్యాంకులు దీన్ని అమలు చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. ఇక ఎట్టకేలకు ఈ నెల 15వ తేదీ వరకు దీనికి బ్యాంకులకు గడువిచ్చారు. అందువల్ల ఈ తేదీ తరువాత ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ యాప్స్‌లో రిజిస్టర్ చేసుకుని తద్వారా బిల్లు చెల్లింపులు, నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీంతో డెబిట్ కార్డు లేని వారికి, వాడని వారికి ఎంతో మేలు జరుగుతుంది.