Sonal Chauhan : అక్కినేని నాగార్జున ఈ ఏడాది కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు చిత్రం ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని తదుపరి చిత్రంపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున “ది ఘోస్ట్” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ తెలియజేయడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమాలో నాగార్జున ఘోస్ట్ పాత్రలోనే కాకుండా గ్లామర్ పాత్రలో కూడా నటిస్తున్నట్లు తాజా ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ హీరోయిన్ తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది.
వైట్ షార్ట్ డ్రెస్‌లో బోట్‌పై నాగ్ తో రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన ముందుగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. అయితే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ కారణంగా ఈమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత కాజల్ స్థానంలోకి అమలాపాల్ ఎంట్రీ ఇచ్చింది. ఇక మొత్తానికి నాగార్జున సరసన నటించే అవకాశాన్ని సోనాల్ దక్కించుకుంది. అయితే వారి స్థానంలో ఈమె నటించడానికి గల కారణం మాత్రం తనకు తెలియదని, ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో సైలెంట్ గా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయానికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం తెలియదని, తనను వదిలేయాలని.. సోనాల్ చౌహాన్ విజ్ఞప్తి చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…