OTT : సోష‌ల్ మీడియా దెబ్బ‌.. ఓటీటీలు అబ్బా.. ఉచితంగానే ఆర్ఆర్ఆర్ మూవీ..!

OTT : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియాకు ఎంత ప‌వ‌ర్ ఉందో మ‌నంద‌రికీ తెలుసు. సోష‌ల్ మీడియా ప‌వర్ ఏంటో చూపించాలే కానీ.. ప్ర‌భుత్వాలే దిగి వ‌స్తాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం గ‌తంలో చూశాం. ఇక ఇప్పుడు సోష‌ల్ మీడియా దెబ్బ‌కు ఓటీటీలు అబ్బా.. అంటున్నాయి. అవును.. నిజంగా ఇది నెటిజ‌న్లు సాధించిన విజ‌యంగానే చెప్పుకోవ‌చ్చు. అస‌లే థియేట‌ర్ల‌లో టిక్కెట్ల రేట్లు పెరిగి అక్క‌డ‌కు వెళ్ల‌లేక ఓటీటీల్లో చూసేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటే.. ఇక్క‌డ కూడా ఓవైపు స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్నా.. ఠాఠ్‌.. పే ప‌ర్ వ్యూ లెక్క‌న రూ.199 చెల్లించి మ‌రీ సినిమా చూడాల్సిందే.. అంటే.. ఎలా.. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజ‌న్లు త‌మ స‌త్తా ఏంటో చూపించారు. ఈ క్ర‌మంలోనే ఈ సెగ జీ5 కు బాగానే త‌గిలిన‌ట్లు ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీని చూసేందుకు ఎలాంటి రుసుము అవ‌స‌రం లేద‌ని తెలియ‌జేసింది. దీంతో ప్రేక్ష‌కుల‌కు భారీ ఊర‌ట ల‌భించింది.

ఆర్ఆర్ఆర్ మూవీ జీ5లో ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమ్ కానున్న విష‌యం విదిత‌మే. అయితే దీన్ని చూడాలంటే.. స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉన్నా స‌రే.. రూ.199 చెల్లించి పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఈ మూవీని చూడాలని జీ5 కండిష‌న్ పెట్టింది. దీంతో అటు అమెజాన్ ప్రైమ్ కూడా కేజీఎఫ్ 2కు ఇలాంటి దిక్కుమాలిన కండిష‌న్ నే పెట్టింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రేక్ష‌కులు ఈ రెండు ఓటీటీ యాప్‌ల‌ను భారీగా ట్రోల్ చేస్తూ విమ‌ర్శించారు. ఓవైపు ఏడాదికో.. ఆరు నెల‌ల‌కో లేదా నెల‌కో అని చెప్పి అధికంగా ఖ‌ర్చు చేసి ఆయా ఓటీటీ యాప్‌ల‌లో స‌బ్‌స్క్రిప్ష‌న్‌ల‌ను తీసుకున్నాం క‌దా.. మ‌ళ్లీ సినిమాల‌ను చూసేందుకు డ‌బ్బులు క‌ట్ట‌మంటారేంటి ? అని సోష‌ల్ మీడియాలో ప్రేక్ష‌కులు ఆయా ఓటీటీ యాప్‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతోపాటు కొన్ని సైట్ల‌లో ఇప్ప‌టికే ఆ మూవీల‌కు చెందిన హెచ్‌డీ ప్రింట్‌ల‌ను కూడా వదిలారు. దీంతో మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని.. జ‌నాలు అంద‌రూ పైర‌సీ చూసేలా ఉన్నార‌ని భావించిన జీ5 త‌న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకుంది. ఆర్ఆర్ఆర్‌ను ఉచితంగానే చూడ‌వ‌చ్చ‌ని.. అయితే త‌మ యాప్‌లో ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉన్న‌వారు మాత్ర‌మే ఈ మూవీని ఉచితంగా చూడ‌గ‌ల‌ర‌ని తెలియ‌జేసింది. దీంతో ప్రేక్ష‌కులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు. క‌చ్చితంగా ఇది సోష‌ల్ మీడియా సాధించిన ఘ‌న విజ‌యం అనే చెప్ప‌వ‌చ్చు.

OTT

ఇక మే 20వ తేదీన ఆర్ఆర్ఆర్‌తోపాటు ప‌లు ఇత‌ర సినిమాలు కూడా ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. కేజీఎఫ్ 2, ఆచార్య, భ‌ళా తంద‌నాన వంటి మూవీల‌ను శుక్ర‌వారం నుంచి స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇక మోహ‌న్ లాల్ న‌టించిన ట్వెల్త్ మ్యాన్ అనే మూవీ నేరుగా ఓటీటీలోనే 20వ తేదీన రిలీజ్ అవుతోంది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీక్షించ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM