Shruti Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈమె కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక శృతి హాసన్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన ప్రేమ వ్యవహారం గురించి నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

ఈ క్రమంలోనే గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలని భావించిన శృతిహాసన్ అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో ప్రేమలో పడింది. తన ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా అతనితో కలిసి నిత్యం షికార్లు చేస్తూ.. సోషల్ మీడియా కంట పడింది. చివరికి వీరిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నామనే విషయాన్ని బయటపెట్టారు.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శంతను.. చివరికి తన ప్రేమ గురించి బయట పెడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. క్రియేటివ్ గా శృతి హాసన్ తో తన పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని తెలిపాడు. శృతిహాసన్ ఎంతో క్రియేటివ్ గా ఆలోచిస్తుందని ఇలా తమ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయని.. ఇలా క్రియేటివ్ గా తమ ఇద్దరి పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని అన్నాడు. ఇక ప్రత్యక్షంగా తమ వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియాల్సి ఉంది.. అంటూ తమ వివాహం గురించి కామెంట్ చేశాడు.