Shruti Haasan : లోకనాయకుడు కమల్‌హాసన్ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్, అందచందాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్. కెరీర్‌లో మధ్య గ్యాప్ తీసుకున్నా గతేడాది జనవరిలో మాస్ మాహారాజా రవితేజ క్రాక్ మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే శృతిని కెరీర్ ప్రారంభంలో నటించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ అని ముద్ర పడింది. కానీ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాకు ముందు పవన్ కూడా వరుస ఫ్లాప్ లతో సతమతం అయ్యాడు.
కానీ ఈ సినిమాకు హిట్ పడటంతో పవన్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. రామ్ చరణ్ కూడా ఎవడు సినిమాకు ముందు వరుస ఫ్లాప్ లతో సతమతమయ్యాడు. కానీ మళ్లీ ఎవడు సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మహేశ్ బాబు సైతం తన కెరీర్ లో శ్రీమంతుడు సినిమాకు ముందు సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డాడు. కానీ శ్రీమంతుడు సినిమా మహేశ్ కెరీర్ లోని బెస్ట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ సినిమా తరవాత మహేశ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. రవితేజ వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న టైంలో బలుపు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో రవితేజకు హిట్ పడింది.
అలాగే వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడిన అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాలో శృతి బన్నీకి జోడీగా నటించి ఆకట్టుకుంది. అక్కినేని హీరో నాగచైతన్యకు సైతం శృతి వల్ల సూపర్ హిట్ వచ్చింది. వీరిద్దరూ కలిసి నటించిన ప్రేమమ్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీకి ముందు చైతూ కూడా సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డాడు. బలుపు సినిమాతో ఫ్లాప్ లలో ఉన్న రవితేజకు గోల్డెన్ గర్ల్ గా మారిన శృతి హాసన్ రెండోసారి కూడా రవితేజకు ప్లస్ అయ్యింది. ఫ్లాప్ లతో ఉన్న సమయంలో రవితేజ శృతి కాంబోలో వచ్చిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ ప్రభాస్ సరసన సలార్ పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. వరుస ఫ్లాప్ లతో ఉన్న డార్లింగ్ కి శ్రుతి ప్లస్ అవుతుందేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…