Shruti Haasan : లోకనాయకుడు కమల్‌హాసన్ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్, అందచందాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్. కెరీర్‌లో మధ్య గ్యాప్ తీసుకున్న గతేడాది జనవరిలో మాస్ మాహారాజా రవితేజ క్రాక్ మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే శృతిని కెరీర్ ప్రారంభంలో నటించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ అని ముద్ర పడింది. కానీ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఆ తర్వాత వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా శృతి హాసన్ తన బాడీ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది. కొన్నేళ్లుగా శృతి హాసన్ ముక్కు విభిన్నంగా సన్నగా కనిపిస్తోంది. ఆమె ప్రారంభ చిత్రాల్లో ఉన్నట్లు ఇప్పుడు ముక్కు లేదు. దీనితో శృతి హాసన్ అందం కోసం ముక్కుకి సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం జరిగింది. దీని గురించి శృతి హాసన్ తాజాగా ఇంటర్వ్యూలో బదులిచ్చింది.
నిజమే.. నా ముక్కుకి సర్జరీ జరిగింది. అయితే దీని గురించి నేను సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవం చెప్పాలి. అంతా అనుకున్నట్లు నేను అందం కోసం సర్జరీ చేయించుకోలేదు. నా ముక్కుకి గాయం అయింది. దీనితో తప్పని పరిస్థితుల్లో సర్జరీ జరిగింది. అందువల్లే నా ముక్కు మునుపటిలా లేదు అని శృతి హాసన్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో క్రేజీ చిత్రాలు ఉన్నాయి. బాలకృష్ణ సరసన గోపీచంద్ మలినేని చిత్రంలో, చిరంజీవి సరసన డైరెక్టర్ బాబీ చిత్రంలో, ప్రభాస్ సరసన సలార్ చిత్రాల్లో శృతి హాసన్ నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…