Sharwanand : కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల చిత్రాలు కూడా ఓటీటీలో విడుదలవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శర్వానంద్, సిద్ధార్థ మల్టీస్టారర్ చిత్రంగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం థియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.
ఈ క్రమంలోనే శర్వానంద్ నటిస్తున్న తదుపరి చిత్రాన్ని థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. శర్వానంద్ వరుసగా నాలుగైదు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొనగా ప్రస్తుతం శర్వానంద్ మంచి హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శర్వానంద్ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మించిన “ఒకే ఒక జీవితం” అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. ఇక శర్వానంద్ నటించిన ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ఇక ఇందులో రీతూవర్మ హీరోయిన్ పాత్రలో నటించగా అక్కినేని అమల కీలక పాత్రలో నటించారు. మరి ఈ చిత్రం ద్వారా అయినా శర్వానంద్ విజయాన్ని అందుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాల గురించి త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…