Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమా ద్వారా గ్లామర్ పాత్రలో అందరినీ ఎంతో సందడి చేసిన ముద్దుగుమ్మ షాలినీ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఎంతో బోల్డ్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 118 చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను సందడి చేసింది. అయితే ఈమె తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న షాలినీ పాండే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

అర్జున్ రెడ్డి సినిమాలో ఎంతో ముద్దుగా బొద్దుగా ఉన్న షాలినీ పాండే తన లుక్ పై ఫోకస్ చేసి ఎంతో నాజూకుగా మారిపోయింది. శరీర బరువు పూర్తిగా తగ్గిన షాలినీ పాండే తన స్టన్నింగ్ లుక్ లో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా క్షణాల్లో వైరల్ గా మారాయి.
సమ్మర్ పేరుతో ఏకంగా షర్ట్ విప్పి ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇలా అందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ ఫోటోలకు ‘ఓల్డ్ స్కూల్ సమ్మర్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారి కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇలా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.