Sarkaru Vaari Paata : మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్‌లిమిటెడ్‌ల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కతున్న చిత్రం.. సర్కారు వారి పాట. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఆయన పక్కన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కళావతి సాంగ్‌తోపాటు పెన్నీ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించాయి. కళావతి పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతుండడం విశేషం. ఇందులో డ్యాన్స్ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఇక పెన్నీ సాంగ్‌లో మహేష్ బాబు కుమార్తె సితార డ్యాన్స్ చేయడం విశేషం. కాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను కొంత సేపటి క్రితమే లాంచ్ చేశారు. సర్కారు వారి పాట.. వెపన్ లేని ఆట.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సర్కారు వారి పాట సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆయన స్వర పరిచిన పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకోగా.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. మే 12వ తేదీన ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.
అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌పై మహేష్ ఫ్యాన్స్ మండిపడ్డారు. సర్కారు వారి పాట అప్‌డేట్ వచ్చి చాలా రోజులు అవుతుందని.. ఇంత ఆలస్యంగా అప్‌డేట్స్ విడుదల చేస్తున్న బ్యాడ్ టీమ్.. అంటూ ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహేష్ కు చెందిన ఓ పిక్‌ను వారు రిలీజ్ చేశారు. అందులో ఆయన తాళాల గుత్తి పట్టుకుని రౌడీలను చితక్కొడుతూ ఉండడం విశేషం. ఇక బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.