Sarkaru Vaari Paata : వరుస సినిమాలతో అలరిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. మే 12న చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు. పోకిరి స్టైల్‌లో ఈ సినిమా ఉండనుందని తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూసి అందరూ ఊహాలోచనలు చేస్తున్నారు. మహేష్ యాక్టింగ్, మేనరిజంలో మోనాటమీ పెరిగిపోయిందనే భావనను మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో బ్రేక్ చేసినట్లు కనిపిస్తోంది. ఆయనను దర్శకుడు గతంలో ఎన్నడూ చూడని ఊరమాస్ అవతార్ లో ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట రూపంలో పర్ఫెక్ట్ మాస్ ప్యాకేజ్ అందించబోతున్నారు. ఇందులో మహేష్ తన డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ తో అదరగొట్టేస్తున్నాడు. ట్రైలర్ మాత్రం మాంచి ఫీస్ట్‌గా ఉంది. అయితే ఈ సినిమా కథ లీకైనట్టు వార్తలు వస్తున్నాయి. లీకైన సర్కారు వారి పాట చిత్ర కథ ప్రకారం.. మహేష్ బాబు ఫారెన్ లో ఉంటూ అప్పులు ఇస్తుంటాడు. ఎగ్గొట్టేవారి దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తుంటాడు. అనుకోని పరిస్థితితుల వల్ల మహేష్ బాబు హీరోయిన్ తో కలిసి ఇండియాకు రావాల్సి వస్తుంది.
ఓ ఆపరేషన్‌లో భాగంగా విలన్ గ్యాంగ్ లో చేరతాడు మహేష్. విలన్స్ గ్యాంగ్ లో ఎందుకు చేరాల్సి వచ్చింది అనేది కథలో అసలైన ట్విస్ట్. మహేష్ బాబుకి తన తండ్రి రూపంలో ప్లాష్ బ్యాక్ ఉంటుంది. మహేష్ తండ్రి ఇలాగే అప్పులు ఎక్కువగా ఇచ్చి మోసపోయి ఉండవచ్చు. అతడి ఫ్యామిలీ వీధిన పడ్డప్పుడు ఊహించని విషాదం జరిగి ఉండొచ్చు. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ డబ్బు విషయంలో ఇంత కఠినంగా ఉంటాడని అనుకుంటున్నారు. సమాజంలో జరుగుతున్న పరిస్థతులని దృష్టిలో పెట్టుకొని పరశురాం ఈ కథని రాసుకున్నాడేమో.. అని కొందరు అనుకుంటున్నారు. అయితే చిత్ర కథ ఇదేనంటూ లీకైతే అయింది. కానీ సినిమా విడుదలయ్యాకే అసలు కథ గురించి తెలుస్తుంది. కనుక అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…