Sarkaru Vaari Paata First Review : యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే 2 ఏళ్ల నుంచి ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు విడుదలవుతోంది. దీంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు గాను అమెరికాలో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ ప్రీమియర్ షోను చూసిన రివ్యూయర్ ఉమైర్ సంధు సర్కారు వారి పాట సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఆయన చెప్పేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
సర్కారు వారి పాట సినిమా అంచనాలకు మించి ఉందని ఉమైర్ సంధు అన్నారు. మహేష్ పవర్ ప్యాక్డ్ యాక్షన్, మాస్ సీన్లను ఇందులో చూడవచ్చని.. దీంతో మహేష్‌ను ఎలాగైతే చూడాలనుకున్నారో.. ఫ్యాన్స్‌కు ఆ కోరిక నెరవేరుతుందన్నారు. మాస్ ప్రేక్షకులకు అయితే ఈ మూవీని చూస్తే పూనకాలు రావడం ఖాయమని అన్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అవుతుందని.. దీంతో మహేష్ హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవడం ఖాయమని అన్నారు.
ఇక ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు. ఆయన స్వర పరిచిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. మొదట్లో విడుదలైన కళావతి పాటతోపాటు తరువాత వచ్చిన పెన్నీ సాంగ్.. ఈ మధ్యే విడుదలైన సినిమా టైటిల్ సాంగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ప్రేక్షకులకు ఈ మూవీ చక్కని వినోదం అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…