Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సమంత పలు వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆమె నటించిన సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇక ఇటీవలే పుష్ప సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్‌లో డ్యాన్స్ చేసిన సమంత అందరినీ.. అలరించింది. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. అంటూ హుషారెత్తించింది.
పుష్ప సినిమాకు సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఐటమ్ సాంగ్స్ చేయాలని ఆఫర్స్ వస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆమె త్వరలో లైగర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుందని తెలుస్తోంది. ఇక సమంత తాజాగా తన సినీ కెరీర్ తొలినాళ్లలో ఎలాంటి పరిస్థితులను అనుభవించిందో చెప్పుకొచ్చింది.
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సమంత.. తాను సినిమాల్లోకి రాకముందు ఎలాంటి దుర్భర పరిస్థితులను అనుభవించిందో తెలియజేసింది. తాను కాలేజీ టాపర్ అని, అయితే తన తల్లిదండ్రులకు స్థోమత లేనందు వల్ల ఉన్నత చదువులు చదవలేకపోయానని తెలిపింది. అందులో భాగంగానే యాక్టింగ్ కెరీర్‌ను ఎంచుకున్నట్లు వివరించింది.
అయితే కెరీర్ తొలిరోజుల్లో అనేక పనులు చేశానని.. ఒక్కో సమయంలో అసలు తినడానికి తిండే ఉండేది కాదని.. రోజుకు ఒక్కసారి మాత్రమే తినేదాన్నని స్పష్టం చేసింది. ఎవరైనా అమ్మాయిలు తమ కలలను సాకారం చేసుకునే వరకు విరమించుకోవద్దని, లక్ష్య సాధన దిశగా ముందడుగు వేయాలని ఆమె సూచించింది. కాగా సమంత ప్రస్తుతం కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాతోపాటు శాకుంతలం, యశోద అనే సినిమాల్లో నటించింది. ఈ మూవీలు త్వరలో విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…