Samantha : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో ఒకరైన అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఈమె పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం సినిమా అవకాశాలను వదులుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే సమంత మొదట్లో హీరో సిద్ధార్థను ప్రేమించిందని, పెళ్లి కూడా చేసుకోబోతుందని.. వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఏ కార్యక్రమానికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లడంతో ఈ జంట పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.
ఇలా కొంతకాలం పాటు సమంత, సిద్ధార్థ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సమంత.. సిద్ధార్థ్ కు దూరమయింది. ఈ క్రమంలోనే నాగచైతన్య తనకు పరిచయం కావడం, అతనితో ప్రేమలో పడటం, అతనిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా గడిపింది. సమంతా గత కొద్ది రోజుల క్రితం ఆహా యాప్ ద్వారా ప్రసారమైన సామ్ జామ్ కార్యక్రమంలో భాగంగా అతిథిగా హాజరైన సెలబ్రిటీతో తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి పంచుకుంది.
ఏది ఏమైనప్పటికీ ఆ హీరోని పెళ్లి చేసుకుని ఉంటే తన జీవితం మరొక సావిత్రిలా అయ్యేదని ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలోనే నాగచైతన్య తన జీవితంలోకి రావడం తన అదృష్టం అని సమంత చెప్పింది. ప్రస్తుతం విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్త అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. అయితే ఇప్పటికీ సమంత తమ విడాకుల విషయంపై మౌనంగా ఉండటంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…