Samantha Naga Chaithanya : సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా, రాజకీయ రంగాలపై మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ తనదైనశైలిలో వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సమంత – నాగ చైతన్య విడాకుల విషయమై స్పందించింది.

ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది.. సమంత విడాకులు తీసుకోవడం ఏంటి ? అంత పెద్ద ఇంటికి కోడలుగా ఉన్న సమంత విడాకులు తీసుకోవడం ఏంటి ? చెన్నైలో ఎక్కువ మంది సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలిపింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సమంత – నాగచైతన్య విడిపోవడం నిజంగానే బాధగా ఉందని తెలిపింది.
పెళ్లి తర్వాత ఎన్నో గొడవలు వస్తుంటాయి. అయితే వాటికి సర్దుకుపోవడం వల్ల జీవితంలో ఎంతో సంతోషంగా ఉండొచ్చు. పెళ్లి తర్వాత సమంత డ్రెస్సింగ్ విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తన డ్రెస్సింగ్ విషయంలో కొంచెం మార్పులు చేసుకొని ఏ విషయం అయినా ఇద్దరూ కలిసి సర్దుకుపోతే వారి జీవితం ఎంతో బాగుంటుందని.. వారిద్దరూ కలిసి ఉండి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి.. అంటూ శ్రీరెడ్డి.. సమంత – నాగ చైతన్య విడాకులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.