Samantha Naga Chaithanya : అక్కినేని నాగచైతన్య, సమంతల గురించి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంత, నాగ చైతన్య ఈ వార్తలపై ఏమాత్రం స్పందించకుండా వారి వారి పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. వీరి గురించి వస్తున్న వార్తలు రోజురోజుకూ ఎంతో ఎక్కువవుతున్నాయి. చైతన్య విడాకుల విషయం గురించి స్పందించకుండా లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ తో ఇన్ని రోజులు బిజీగా ఉన్నాడు. ఇక సమంత కూడా తన పనులతో బిజీగా ఉండటం వల్ల వీరిద్దరూ తమ గురించి వస్తున్న వార్తలపై స్పందించలేదు.

ప్రస్తుతం నాగచైతన్య, సమంత సక్సెస్ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా విజయవంతం కావడం, మరోవైపు సమంత తన సాకీ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించి సంవత్సరం కావడంతో వీరిద్దరూ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొంటున్నారు. ఇకపోతే గత కొద్దిరోజుల నుంచి వీరిపై వస్తున్న వార్తలు అన్నిటికీ సమాధానం చెప్పబోతున్నాను అంటూ సమంత తెలియజేసింది.
https://www.instagram.com/p/CUWxscBBtVr/?utm_source=ig_web_copy_link
ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లోకి రానున్న సమంత ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పబోతున్నానని తెలిపింది. ఎప్పటి నుంచో ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అభిమానులు సమంతపై ప్రశ్నల వర్షం కురిపించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి అభిమానుల ప్రశ్నలకు సమంత తడబడుతుందా ? లేక గత కొద్ది రోజుల నుంచి అభిమానులలో ఏర్పడిన సందిగ్ధతను తొలగించబోతుందా.. అనేది తెలియాల్సి ఉంది.