Samantha Naga Chaithanya : సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలో కూడా అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత అభిమానులు ఎంతో డిజప్పాయింట్ అయ్యారు.
టాలీవుడ్‌లో బెస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన సమంత, నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? అని.. అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే కారణాలు ఏమున్నప్పటికీ.. తాజాగా ఒక కఠోర సత్యం వెలుగు చూసింది.
సమంతకు నాగచైతన్య అంటే ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని సమంత మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ వెల్లడించారు. సమంతకు చైతన్య అంటే ఎంతో ఇష్టమని, ఆయనను విడిచి సమంత ఒక్క క్షణం కూడా ఉండేది కాదని, వారు పిల్లలను కనేందుకు కూడా ప్లాన్ చేశారని.. సమంత ఎప్పుడూ పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను చదివేదని.. తెలిపింది.
అయితే ఇంత అన్యోన్యంగా ఉన్న దంపతులు ఎందుకు విడిపోయారన్నది అర్థం కాని విషయంగా ఉందని సద్నా సింగ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు సహజమే. కానీ విడాకులు తీసుకునేంత గొడవలు ఆ ఇద్దరి మధ్యా ఏమున్నాయి ? అనేదే అసలు ప్రశ్న. మరి ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి.