Samantha : నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్ పాతాళానికి పడిపోతుందని, ఆమె పని అయిపోయినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ ఆమె జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలపై కూడా దృష్టి సారిస్తోంది. రీసెంట్‌గా రెండు సౌత్ మూవీస్ ను ప్రకటించింది సమంత. ఇందులో ఒకటి శ్రీదేవీ మూవీస్ వారు నిర్మించే సినిమా కాగా, మరొకటి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించే సినిమా.
ఈ రెండు సినిమాలు అటు తెలుగు, ఇటు తమిళంలోనూ నిర్మించబోతున్నారు. త్వరలో ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు రానున్నాయని, సమంత ఈ రెండు సినిమాలకు ఒకేసారి డేట్స్ సర్దుబాటు చేసిందని.. సమాంతరంగా ఈ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటుందని వార్తలు వచ్చాయి. ఇక ఓ బేబీ నిర్మాత సునీత తాటి 2004లో వచ్చిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
బాఫ్టా అవార్డును సొంతం చేసుకున్న ఫిలిఫ్ జాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. ఇందులో సమంత కూడా నటిస్తుండగా, ఆమె పాత్ర బైసెక్సువల్ అని తెలుస్తోంది. తమిళ అమ్మాయి అయిన ఈమె స్వతంత్ర ఆలోచనలతో పెరిగే అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేయాలని ఒత్తిడి ఉంటుందట. కానీ సమంత పాత్ర మాత్రం తన సొంత ఆలోచనలతో జీవితాన్నిఎంచుకుంటుందట. ఇది ఛాలెంజింగ్‌గా ఉంటుందని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ బేబీ తరువాత మళ్లీ సునీతతో పని చేయడం ఆనందంగా ఉందని స్పష్టం చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…