Samantha : నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత కొంతకాలం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది. వాళ్లిద్దరూ విడిపోయిన తరువాత ఆమె తన స్నేహితులతో కలసి కొన్ని విహార యాత్రలకు వెళ్లి దానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది. కానీ కొంతకాలంగా సమంత ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్ లకు దూరంగా ఉంటూ వస్తుంది. తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లు ఇవ్వడం తప్ప తను నేరుగా సోషల్ మీడియాలో కనింపించి చాలా కాలం అయ్యింది. దీంతో తన లైఫ్ లో ఏవో ఇబ్బందులు ఉన్నాయని, తను ఏదో ఆపరేషన్ చేయించుకుందని ఇలా రకరకాల రూమర్లు చెక్కర్లు కొట్టాయి.
అయితే తను ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యిందని తెలుస్తుంది. 3 రోజుల క్రితం తన పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసిన సమంత, దానికి ట్యాగ్ లైన్ గా , కింద పడినా ఇంకా ఔట్ కాలేదని రాసుకొచ్చింది. ఇక తాజాగా సమంత తన ఫోటోను కూడా ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్ లలో షేర్ చేసింది. ఈ ఫోటో లో ఆమె “ఇక నువ్వెప్పుడు ఒంటరిగా నడవవు” ( యు విల్ నెవర్ వాక్ అలోన్) అని రాసి ఉన్న టీ షర్ట్ ను ధరించింది. దీంతో ఆమె ఎవరితోనో రిలేషన్ లో ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంకా ట్విట్టర్ లో దర్శకుడు రాజమౌలి కొడుకు కార్తికేయ, ఈగ సినిమా గురించి వేసిన పోస్టుపై కూడా సమంత స్పందించింది. ఈ విధంగా తాను మళ్లీ ఫామ్ లోకి వచ్చానని , యాక్టివ్ అయ్యానని చెప్పకనే చెప్తుందని అంటున్నారు. అయితే సమంత తన చర్మానికి వైద్యం కోసం అమెరికా వెళ్లిందని కొందరు చెబుతుండగా ఆమె మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. కానీ ఆమె రీసెంట్ గా అమెరికా నుండి తిరిగి రావడం మాత్రం నిజమనే వినిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె త్వరలో తాను విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొననుందని తెలిసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…