Samantha : సమంత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందులో షేర్ చేస్తోంది. అలాగే పలు బ్రాండ్లను ప్రమోట్ కూడా చేస్తోంది. 2021వ సంవత్సరంలో సమంత నటించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. కానీ పుష్ప సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. దీంతో అల్లు అర్జున్, రష్మిక మందన్నలకు ఎంత పేరు వచ్చిందో ఆమెకు కూడా అంతే గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే సమంతకు ప్రస్తుతం పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కోసం ఆఫర్లు వస్తున్నాయి. ఈమె లైగర్‌లో ఓ ఐటమ్ సాంగ్ చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక సమంత ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
సమంత తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెరూన్ కలర్ టాప్ ధరించిన ఆమె గ్లామర్ షో చేస్తూ ఆకట్టుకుంటోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత వాస్తవానికి తన గ్లామర్ డోసును పెంచిందనే చెప్పవచ్చు. వెకేషన్స్‌లో, బ్రాండ్ల ప్రమోషన్లలో ఆమె అందాలను ఆరబోస్తోంది. ఇక పుష్ప ఐటమ్ సాంగ్‌లో అయితే ఒక రేంజ్‌లో అందాలను ప్రదర్శించింది. దీంతో ఆమె గ్లామర్‌ను చూసి అందరూ షాకయ్యారు. గతంలో ఆమె ఎన్నడూ ఆ స్థాయిలో చేయలేదని అంటున్నారు.
కాగా సమంత ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన సినిమాలు ఈ ఏడాదిలో వరుసగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళంలో ఆమె నటించిన కాతు వాకుల రెండ్ కాదల్ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుండగా.. అందులో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. అలాగే పాన్ ఇండియా మూవీ యశోదలోనూ సమంత నటించగా.. శాకుంతలం అనే ఇంకో మూవీలోనూ ఆమె యాక్ట్ చేసింది. ఇవన్నీ వరుసగా త్వరలోనే విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…