Samantha : నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి సమంతపై నెగెటివిటీ ఎక్కువైపోయింది. ఆమె ఏం చేసినా.. సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టినా.. ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆమె గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తే అయితే.. ఇంకా ఎక్కువగానే ఆమెను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సమంత చైతూకు విడాకులు ఇవ్వడాన్ని అక్కినేని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనుకనే వారు పదే పదే సమంతను టార్గెట్ చేస్తున్నారు. అయితే సమంత గతంలో ఇలాంటి విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాను సెన్సిటివ్ అనుకుంటే పొరపాటు పడినట్లే అని.. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసని.. తన మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దని.. ఆమె ఇన్‌డైరెక్ట్‌గా అక్కినేని ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చింది.
అయినప్పటికీ సమంతపై వస్తున్న నెగెటివిటీ మాత్రం తగ్గడం లేదు. అయితే సమంత వాస్తవానికి చైతన్యతో ప్రేమలో పడకముందు నటుడు సిద్ధార్థతో లవ్ ట్రాక్ నడిపిందని తెలుస్తోంది. అప్పట్లో వీరిద్దరూ చాలా చోట్లకు కలసి వెళ్లారు. శ్రీకాళహస్తిలో అయితే ఇద్దరూ కలసి ఏకంగా పూజలు కూడా చేయించారు. జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోవడం కోసం సమంత, సిద్ధార్థ అక్కడ పూజలు చేశారు. దీంతో ఈ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి.. అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు.. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట. ఈ వార్తలు సమంత తన విడాకుల విషయాన్ని వెల్లడించాక వైరల్ అయ్యాయి.

అయితే కాళహస్తిలో పూజలు చేసినప్పటికీ సమంత జాతకంలో ఉన్న దోషం మాత్రం పోలేదట. కనుకనే ఆమె చైతన్యకు విడాకులు ఇచ్చిందని అంటున్నారు. ఆమె జాతకంలో ఉన్న దోషం వల్లే ఆమె వివాహ బంధం నిలబడలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త మళ్లీ వైరల్ అవుతోంది. అయితే సమంత విడాకుల విషయాన్ని ప్రకటించగానే సిద్ధార్థ కూడా ట్విట్టర్‌లో ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ పెట్టాడు. కర్మ అనేది తగులుతుంది.. అన్నట్లు అర్థం వచ్చేలా సిద్ధు ట్వీట్ చేశాడు. దీంతో ఆయన ట్వీట్ అప్పట్లో వైరల్ అయింది. అయితే సమంత జాతకంలో ఉన్న దోషం ఇంకా ఆమెపై ఏవిధమైన ప్రభావాన్ని చూపిస్తుంది.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.